మెంటాడ మండలం జయితి గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రతిష్ఠ కార్యక్రమంలో వేదపండితులు వేదుల భువనేశ్వర ప్రసాద్ శర్మ, దేవస్థానం చైర్మన్ చాపాన జోగి నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగాలను కోలాటాలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. శనివారం ఉదయం 7:30 గంటలకు ప్రతిష్ఠాపన కార్యక్రమం చేపడతామని అన్నారు.