మెంటాడ మండలం బిరసాడవలస గ్రామం వద్ద ఉన్న కోళ్ల ఫారమ్‌ను గ్రామానికి దూరంగా తరలించాలని జనసేన పార్టీ మండల నాయకుడు సబ్బవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గురువారం రిలే నిరాహారదీక్షా చేపట్టారు. 8వ రోజుకు చేరుకున్న ఈ దీక్ష గ్రామంలో తీవ్ర దుర్గంధం వాపోతుందని, ఆ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టోకురు రామకృష్ణ, ఈది బిల్లి కన్నయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.