మెంటాడ మండలం లోతుగెడ్డలో మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ జే జనార్ధన రావు ఆధ్వర్యంలో నవోదయం 2. 0 కార్యక్రమం నిర్వహించారు. నాటుసారా తరలించడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. నాటు సారా తాగడం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. అనంతరం సర్పంచ్, వీఆర్వో, పంచాయతీ సెక్రెటరీ, ఎస్ హెచ్ జి గ్రూపు సభ్యులతో నాటుసారా నిర్మూలనకు కమిటీ ఏర్పాటు చేశారు.