గంట్యాడ మండలంలోని వసాది గ్రామంలో నవధాన్యాల కిట్లు తయారీ కార్యక్రమం శుక్రవారం మండల వ్యవసాయ అధికారి శ్యాం కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. వరి పంటకు ముందుగా వేయడానికి తొమ్మిది రకాల విత్తనాలతో నవధాన్యాల కిట్లు తయారు చేశారు. వ్యవసాయ శాఖ ఏవో సంగీత, పకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.