రామభద్రపురం మండల జనసేన నాయకుడు దనంజయ్పై ఆదివారం హత్యాయత్నం జరిగింది. రామభద్రపురంలోని ప్రభుత్వ పశువుల ఆసుపత్రి స్థలం కబ్జాపై దనంజయ్ గతంలో పోరాటం చేశారు. కబ్జాపై వైసీపీ హయంలో చర్యలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో హైకోర్టులో కేసు వేశారు. ఆ విషయమై అదే గ్రామానికి చెందిన బోను అక్కునాయుడు రామమందిరం వద్ద దనంజయ్పై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.