సాలూరు : కురుకూటిలో ఐఆర్ టి ఎస్ ఉచిత నేత్ర వైద్య శిబిరం

57చూసినవారు
సాలూరు : కురుకూటిలో ఐఆర్ టి ఎస్ ఉచిత నేత్ర వైద్య శిబిరం
సాలూరు మండలం కురుకూటి గ్రామంలో ఐ.ఆర్.డి.ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 40 మందికి శస్త్రచికిత్స అవసరమని గుర్తించారు. విజయనగరంలోని పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు పి. పావని, దివ్యాయి తదితరులు పరీక్షలు చేసి, అవసరమైన మందులు, ఐడ్రాప్‌లు అందజేశారు. ఆరోగ్య శ్రీ కార్డుతో ఆపరేషన్లు చేయాలని ఐ.ఆర్.డి.ఎస్ ప్రతినిధి స్వాతి శ్రీ తెలిపారు. 10 గిరిజన గ్రామాల ప్రజలు శిబిరానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్