ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేసిన కార్యదర్శి పావని

50చూసినవారు
ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేసిన కార్యదర్శి పావని
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని గజపతినగరంలో బుధవారం ఖాదీ వస్త్రాన్ని కొనుగోలు చేశారు. అంతకుముందు సచివాలయం వద్ద గల గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి మండపాక భారతి, నియోజకవర్గ కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్, మండల పార్టీ అధ్యక్షుడు ఆరిశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్