విజయనగరం జిల్లా, గంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన దాడిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో ఖండించారు. అమరావతి పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సంఘటన వివరాలు తెలుసుకుని సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తో మాట్లాడిన ఆయన బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.