
గజపతినగరం: కోడిపందాలు ఆడుతున్న 8 మంది అరెస్టు
గంట్యాడ మండలం బోనంగి గ్రామ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై ఎస్సై సాయి కృష్ణ సోమవారం తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా కోడిపందాలు ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 4 కోడి పుంజులు, రూ. 6950 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.