బైపీసీ విద్యార్థులకు సువర్ణావకాశం

56చూసినవారు
బైపీసీ విద్యార్థులకు సువర్ణావకాశం
ఇంటర్‌ బైపీపీ 2024లో పూర్తి చేసిన విద్యార్థులకు బీఎస్సీ పారా మెడికల్‌, నర్సింగ్‌, బీపీటీ,ఎంఎల్ టీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నామని బొల్లినేని మెడ్‌స్కిల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు తెలిపారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 19వరకు అవకాశం ఉందన్నారు. కోర్సు పూర్తయ్యాక, ఉద్యోగం కల్పించి, ఫీజును జీతం నుంచి మినహాయిస్తామన్నారు. ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పదో తరగతి, ఇంటర్‌, టీసీ, స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 19న సాయంత్రం 3లోగా రాగోలులోని జెమ్స్‌ ప్రాంగణంలోని తమ కళాశాల నందు సంప్రదించాలని సూచించారు. ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు 9121999654, 7680945357, 7995013422 నెంబర్లకు కాల్‌ చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్