కొమరాడ మండలం శిశాడవలసలో ఓ గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చారు. రోడ్డు సౌకర్యం లేక ఆమెను మంచంపై మోసుకొని హాస్పిటల్కి అంగన్వాడీ సాయంతో మంగళవారం తరలించారు. చాలా ఏళ్ళ నుంచి రోడ్డు సౌకర్యం అనేది లేదని, అత్యవసర పరిస్థితుల్లో కూడా నానా అవస్థలు పడుతూ మండలానికి, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.