కురుపాం కోర్టు సమీపంలో రహదారి భద్రతపై బ్రేక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వాహనదారులకు, ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పైడితల్లి, హెడ్ కానిస్టేబుల్ శ్రీహరిరావు సిబ్బంది పాల్గొన్నారు.