రేషన్ సరఫరాలో ఎండియు వ్యవస్థను రద్దు చేస్తూ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి వేణు డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎండియు సిబ్బంది, ఉపాధి వేతనదారులతో కలిసి నిరసన తెలిపారు. ప్రజల ఇంటికి నిత్యావసరాలు చేరవేసే ఎండియు విధానం పేదలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. అవసరమైన వారికి డిపోల వద్ద కూడా సరుకులు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.