కురుపాం మండలంలోని 23 పంచాయతీలలో డ్వామా పీడీ రామచంద్రరావు ఆధ్వర్యంలో అధికారులు చేపట్టిన సామాజిక తనిఖీలలో అక్రమాలె వెలుగు చూశాయి. కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించి మృతి చెందిన వారికి పింఛన్లు మంజూరు చేసి అవకతవకలకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను డ్వామా పీడీ ఆదేశించారు.