సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు సాంబమూర్తి అన్నారు. కొమరాడ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో బుధవారం నిరసన తెలియజేశారు. స్కీమ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి కనీసం రూ. 26 వేలకు జీతం పెంచాలన్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దుచేసి కార్మికుల పక్షాన నిలవాలని డిమాండ్ చేశారు.