ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం తగదు

64చూసినవారు
ఎమ్మెల్యే పై తప్పుడు ప్రచారం తగదు
కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిపై కొంతమంది చేస్తున్న తప్పుడు ఆరోపణలు తగవని కొమరాడ మండల బీసీ నాయకులు హితవు పలికారు. శుక్రవారం మండల పార్టీ కన్వీనర్ ఉదయ శేఖరపాత్రుడు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ' ఎమ్మెల్యే బీసీల ద్రోహి అని అన్నవారే నిజమైన ద్రోహులు' అని అన్నారు. బీసీల కోసం అనేక కార్యక్రమాలు చేసిన ఎమ్మెల్యే పనితీరుపై బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్