నిరుద్యోగ వేద పండితులకు గుడ్ న్యూస్

65చూసినవారు
నిరుద్యోగ వేద పండితులకు గుడ్ న్యూస్
మన్యం జిల్లా, వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగ వేద పండితులకు నిరుద్యోగ భృతి కల్పించుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ సహాయ కమిషనరు సుధారాణి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోగా సమర్పించాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించిన నిరుద్యోగులకు నెలకు 3వేలు నిరుద్యోగ భృతి కల్పించుటకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్