తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని గుమ్మలక్ష్మీపురం పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లు నిరసనకు దిగారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాచేశారు. ఎన్ని నెలలు గడిచిన సరే వేతనాలు చెల్లించక పోవడంతో అవస్థలకు గురవుతున్నారని సిపిఎం నాయకులు తెలిపారు. ఈకార్యక్రమం సీపీఎం నాయకులు ముండంగి రమణ, కోలక అవినాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.