జోగులుడుమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ

50చూసినవారు
జోగులుడుమ్మ ఫీల్డ్ అసిస్టెంట్ పై విచారణ
జియ్యమ్మవలస మండలం జోగులడుమ్మ గ్రామ ఉపాధిహామీ క్షేత్ర సహాయకురాలు నాగమణి అవినీతి ఆరోపణలపై బుధవారం ఎంపీడీవో శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు. క్షేత్ర సహాయకురాలు అవినీతికి పాల్పడిందని ఒక వర్గం చెప్పగా ఎంపీపీ బొంగు సురేష్ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆరోపణలు చేస్తున్నారని మరో వర్గం చెప్పింది. తుది నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఎంపీడీవో తెలిపారు.

సంబంధిత పోస్ట్