జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ పాఠశాలో ఏడో తరగతి విద్యార్థి నిమ్మక జీవన్ కుమార్ (12) ఆకస్మికంగా మృతి చెందాడు. బుధవారం తనకు ఎక్కువగా తలనొప్పి ఉందని తోటి విద్యార్థులకు చెప్పాడు. వారు వెంటనే డిప్యూటీ వార్డెన్ ఆర్. గణపతిరావుకు సమాచారమిచ్చారు. దీంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యాధికారి విద్యార్థికి చికిత్స అందించేలోగా ప్రాణం విడిచినట్లు నిర్ధారించారు.