మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం బాసంగి పరిసరాల్లో ఏడు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రధాన రహదారి సమీపంలో ఏనుగులు గుంపు సంచరిస్తుండడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని ధ్వంసం చేస్తాయన్న భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.