పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పాత నిమ్మలపాడు గ్రామ సమీపంలోకి గురువారం ఉదయం ఏనుగుల గుంపు చేరుకుంది. ఈ గుంపు పొలాల వైపు తిరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర గ్రామాల రహదారిలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.