మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని దొరజమ్ము గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి కొండగర్రి దినేష్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. విద్యార్థికి జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందాడు. తన కుమారుడు పరిస్థితి మరొకరికి కలుగకుండా చూడాలని ఆ తల్లి పెట్టిన కన్నీరు అందరినీ కలిచివేసింది.