ఒడిశా పిప్పలగూడ ఘాట్ రోడ్డులో శనివారం సాయంత్రం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొందుకుప్ప, మూలిగూడ గ్రామాలకు చెందిన 15 మంది జగన్నాథ రథయాత్రకు రాయగడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమతి, స్నేహ, జయంతి, స్రవంతి, శ్రీరామ్ తీవ్రంగా గాయపడి పార్వతీపురం ఆసుపత్రికి తరలించగా, మిగిలిన 10 మందిని కురుపాం ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు.