మన్యం జిల్లా కురుపాం మండలంలో ఐటీడీఏ పీవో ఆశతోష్ శ్రీవాత్సవ ఆదేశాల మేరకు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలనపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నీలకంఠాపురం పీహెచ్ సీ వైద్యాధికారి అభినవకుమార్ ఆధ్వర్యంలో సుక్కుగాడిగూడ, దండుసూర, ఊసకొండ, నడిమిగూడ గ్రామాలలో కళాజాత నిర్వహించారు. ప్రజలకు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. హెచ్ఎస్ శ్రీహరి, వైద్య సిబ్బంది ఉన్నారు.