కురుపాం: గ్రామాలభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

69చూసినవారు
కురుపాం: గ్రామాలభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
గ్రామాలభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేయడం జరుగుతుందని కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కురుపాం మండల పరిధిలోని శివ్వాము గ్రామంలో దాదాపు 3 లక్షల రూపాయలు వ్యయముతో ప్రధాన రహదారి నుంచి నాగావళి నదికి వెళ్లేందుకు నిర్మాణం చేపట్టిన సిమెంట్ రహదారిని శుక్రవారం ప్రారంభించారు. గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్