పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం పెదగొత్తిలి పంచాయతీ కోలిసగూడ, ఆరికోరిడి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన స్కూల్ కాంపౌండ్ వాల్‌ను ఎమ్మెల్యే జగదీశ్వరి మంగళవారం ప్రారంభించారు. విద్యా వ్యవస్థకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పాఠశాల ప్రహరీ గోడలు విద్యార్థులకు రక్షణ కవచంలా ఉంటాయన్నారు.