రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కురుపాం మండలంలోని తోటగూడలో శనివారం మహిళా పోలీస్ జి. లక్ష్మి గిరిజన ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలు, పదార్థాలు, రోడ్ యాక్సిడెంట్లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని, మొబైల్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ సైబర్ క్రైమ్ నేరాలకు మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.