ఫిబ్రవరి 8న జరిగే ప్రజ్ఞా వికాసం పరీక్షకు పదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ కురుపాం మండల బాధ్యులు ఆరిక గంగారావు పిలుపునిచ్చారు. మండలంలోని మొండెంఖల్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రజ్ఞ వికాస్ పరీక్షపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి ఏటా పదో తరగతి పబ్లిక్ పరీక్షల ముందు పబ్లిక్ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు.