కురుపాం: రైసు మిల్లర్లకు కీలక ఆదేశాలు

62చూసినవారు
కురుపాం: రైసు మిల్లర్లకు కీలక ఆదేశాలు
రైసు మిల్లర్లు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని గరుగుబిల్లి తహశీల్దార్ పి. బాల అన్నారు. గరుగుబిల్లి మండలంలోని పెద్దూరు రెవిన్యూ పరిధిలోనున్న రైస్ మిల్లులను గురువారం ఆమె పరిశీలించారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలన్నారు. బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వని మిల్లులపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. రైతులును ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్