లిఫ్ట్ ఇరిగేషన్ సమస్య మరోసారి రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి దృష్టికి వెళ్లింది. శుక్రవారం గుమ్మలక్ష్మీపురం మండల పర్యటనకు వెళ్లిన ఆమెకు గరుగుబిల్లి మండలం గిజబ జంక్షన్ వద్ద టీడీపీ ప్రతినిధులు డొంకాడ రామకృష్ణ, మరడాన తవిటినాయుడు ఆధ్వర్యంలో రైతులు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. అలాగే జియ్యమ్మవలస మండలంలో చింతల బెలగాం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని పలువురు వినతిపత్రం అందజేశారు.