కురుపాం: క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

53చూసినవారు
కురుపాం: క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం, ధర్మలక్ష్మీపురం గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంట్‌ను మంగళవారం కురుపాం శాసన సభ్యులు తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ క్రీడల్లో రాణించాలని అన్నారు. క్రికెట్ వలన అనేక మంది యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువత తదితరులు పాల్గున్నారు.

సంబంధిత పోస్ట్