టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తన కుటుంబ సభ్యులతో కలిశారు. సోమవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల సమయంలో నియోజకర్గకంలోని నాయకుల పనితీరు, ఓటింగ్ సరళిని ఆయనకు వివరించినట్లు సమాచారం.