అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్ అనుసంధానానికి కురుపాం అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించి గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకరరావు అన్నారు. కురుపాం మండలంలోని బియ్యాలవలస పంచాయతీ మంత్రజోలలో గల వన్ ధన్ వికాస కేంద్రాన్ని (విడివికె) ఆదివారం ఆయన సందర్శించారు. అక్కడ వెలుగు ద్వారా గిరిజన మహిళలకు చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారీ మిల్లును పరిశీలించారు.