గుమ్మలక్ష్మీపురం మన్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత మూడు రోజుల నుండి ప్రజలు మలేరియా, వైరల్ వంటి విష జ్వరాల బారినపడి భద్రగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో విషజ్వరాలు వ్యాపించడంతో ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా పెరగడంతో మంచాలు చాలక ఒకే మంచంపై ఇద్దరి, ముగ్గురికి వైద్యం అందిస్తున్నారు. రోజుకు 200 నుంచి 250 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారు.