కొమరాడ మండలం అర్ధామ్ గ్రామంలో శుక్రవారం నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఒక బైక్, 400 నాటు సారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గుమడ గ్రామానికి చెందిన వెలగడ సింహాద్రి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి నాటు సారా ప్యాకెట్లను, ఒక బైకును స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేశారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ఐలు నాగేశ్వరరావు, రేవతమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.