కురుపాం శివారు భూములకు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదివారం తెలిపారు. కుడి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి విడుదల చేశారు. గరుగుబిల్లి మండలానికి నీటి సరఫరా కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు. వంతెనలు, ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేస్తామన్నారు.