అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె గురువారం స్థానిక విలేకర్లతో ఫోన్లో మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటనకు యావత్ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయిందన్నారు. క్షతగాత్రులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని కోరారు.