కురుపాం: వెదురు తడకలే ఆ పాఠశాల గేటు

108చూసినవారు
కురుపాం: వెదురు తడకలే ఆ పాఠశాల గేటు
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఇచ్చాపురంలో ఉన్న పాఠశాలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినప్పటికీ గేటు నిర్మాణాన్ని చేపట్టలేదు. దీంతో ఉపాధ్యాయులు వెదురు కర్రలతో చేసిన తడకనే గేటుగా వినియోగిస్తున్నారు. గేటు నిర్మాణాన్ని చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని, గేటు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు

సంబంధిత పోస్ట్