ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గిరిజన యువకుడు మృతి చెందినట్లు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. మృతుని కుటుంబ సభ్యుల్ని గురువారం పరామర్శించారు. గుమ్మలక్ష్మిపురంలో జరిగిన కంది కొత్తల పండగలో వేడి సాంబార్ టబ్బులో పడి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రమేష్ దగ్గరికి కురుపాం ఎమ్మెల్యే గానీ, కలెక్టర్ గానీ వెంటనే వెళ్లి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించినట్లయితే రమేష్ బతికి ఉండేవాడని ఆమె అన్నారు.