కొమరాడ మండలం కందివలసలో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు గురువారం అధికారులు తెలిపారు. ఆ సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఎవరు కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. ఏనుగులను గ్రామాలకు దూరంగా తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలన్నారు.