ఏనుగులను ప్రస్తుతం ఉన్న ప్రాంతాల నుంచి త్వరలో తరలిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి తెలిపారు. పంటలకు భారీ నష్టం వాటిల్లిందని, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఏనుగులను తరలించేందుకు కుంకీ ఏనుగులు వస్తాయని మంత్రి తెలిపారు. కురుపాం మండలంలోని మారుమూల గ్రామాల్లో రెండు రోడ్లను మంత్రి ప్రారంభించారు. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, కురుపాం ఎమ్మెల్యే తదితరులు హాజరయ్యారు.