మాతా, శిశు ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని మన్యం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా. ఎస్. భాస్కరరావు ఆదేశించారు. ఆశా నోడల్ అధికారులకు శనివారం ఎన్జీఓ హోంలో నిర్వహించిన సమావేశంలో డా. భాస్కరరావు మాతాశిశు ఆరోగ్య సేవలపై సమీక్షించారు. ఆర్సిహెచ్ మాతాశిశు నమోదులో ఏఎన్ఎం, ఆశా పనితీరు విశ్లేషించాలని, ఈ ఆశా యాప్ లో సూచికల వివరాలు పరిశీలించాలన్నారు. గత సంవత్సర సేవలపై విశ్లేషించి పురోగతి దిశగా కృషి చేయాలన్నారు.