పార్వతీపురం ఐటిడిఎ పరిధిలోని కొమరాడలో నిర్మిస్తున్న రెండు బీటీ రోడ్ల నిర్మాణ పనులను ఐటిడిఎ, పిఓ అశుతోష్ శ్రీవాస్తవ బుధవారం పరిశీలించారు. దిగువ గుణద నుంచి సవర గుణద వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డుతో పాటు దిగువ గుణద నుంచి బిన్నిడి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డును సందర్శించి, నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రహదారులు నాణ్యతగా ఉండాలని, నాణ్యత లేని రహదారులకు బిల్లులు చెల్లింపులు ఉండబోవని స్పష్టం చేశారు.