పాఠశాలలు, వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, బలవర్ధకమైన ఆహారాన్ని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పార్వతీపురం మన్యం జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత పేర్కొన్నారు. అందులో భాగంగా గురువారం జిల్లాలోని 1, 504 పాఠశాలలకు 5, 184 ( 25 కేజీలు ) బస్తాలను, 150 వసతి గృహాలకు 13, 456 బస్తాల ఫోర్టీఫైడ్ సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.