మాతాశిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్యశాఖ అడుగులు వేస్తుందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అదనపు సంచాలకులు డాక్టర్ కెవిఎస్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మన్యం జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరు పర్యవేక్షణకు విచేసిన ఆయన గురువారం పార్వతీపురం ఎన్జీఓ హోం లో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు అంశాలపై ప్రస్తావించి సమీక్ష జరిపారు.