ఎన్టీఆర్ లాంటి తాత, చంద్రబాబు లాంటి విజనరీ కుటుంబంలో జన్మించడం నా అదృష్టమని మంత్రి నారా లోకేష్ అన్నారు. షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా పార్వతీపురంలో విద్యార్థినీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో విద్యార్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా మీకు రాజకీయాల్లో స్పూర్తినిచ్చింది ఎవరు అని రిషిత అనే విద్యార్థిని అడిగినపుడు లోకేష్ సమాధానం ఇచ్చారు.