సమాజంలో పేద, ధనిక తారతమ్యాన్ని తగ్గించి 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు సంకల్పించిన పి4 పథకం ద్వారా బంగార కుటుంబాలను గుర్తించి అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పారిశ్రామికవేత్తలు, సంపన్నులకు పిలుపునిచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ గిరిమిత్ర భవనంలో సమావేశం శనివారం ఐటీడీఏ పి ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు.