జిల్లాలో వయోజన విద్యా కార్యక్రమం క్రింద శిక్షణ పొందే వారికి కనీస అక్షర జ్ఞానం ఉండాలని మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమం క్రింద చదవడం, రాయడం, పుస్తకాలు నిర్వహణ వంటి కనీస పరిజ్ఞానం ఉండాలన్నారు.