పార్వతీపురం పట్టణంలో జగన్నాథ స్వామి మారు రథయాత్ర శనివారం అంగరంగ వైభవంగా సాగింది. ఎమ్మెల్యే విజయ్ చంద్ర యాత్రలో పాల్గొని జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఎమ్మెల్యే రథం లాగి యాత్రను పున: ప్రారంభించారు. భక్తులతో కలిసి రధాన్ని లాగి భక్తి భావాన్ని చాటుకున్నరు. స్థానిక యువతను భక్తి మార్గం వైపు నడవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.